ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 500 నోట్లకు కొన్ని ఫీచర్లు జోడించి కొత్త వాటిని విడుదల చేస్తున్నట్లు RBI ప్రకటించింది. చెలామణిలో ఉన్న రూ.500 నోట్లకు మరింత భద్రత కల్పించి కొత్తవాటిని విడుదల చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. కొత్త నోటుపై ‘ఏ’ అనే అక్షరాన్ని జోడించామని తెలిపింది.
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో పాటు.. వెనక వైపు 2017 అని ముద్రించిన కొత్త రూ. 500 కరెన్సీ నోటును విడుదల చేసినట్టు కేంద్ర బ్యాంకు మంగళవారం (జూన్13) ప్రకటించింది. అలాగే ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 500 నోట్లు కూడా చలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రజలు ఎవరూ ఆందోళన పడొద్దని.. కేవలం కొత్త సిరీస్ తో నోట్లు మాత్రమే విడుదల చేస్తున్నామని తెలిపారు.
దాదాపు పాతనోటును పోలిన 66 ఎంఎంx150 ఎంఎం, స్టోన్ గ్రే కలర్, రెడ్ ఫోర్ట్ భారతీయ వారసత్వ ప్రదేశం ఎర్ర కోట – రివర్స్ లో భారతీయ జెండా స్పెసిఫికేషన్స్ తో దీన్ని రూపొందించినట్టు ఆర్‌బీఐ తెలిపింది. దీంతోపాటు మహాత్మా గాంధీ చిత్రపటాన్ని, అశోక్ స్థంభం కుడివైపున బ్లీడ్ లైన్స్ ఇతర గుర్తులతోపాటు… అంధులు గుర్తించేలా ఇంటగ్లియో ముద్రణను కూడా జత చేసింది.
గతేడాది నవంబర్ లో ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన రూ.500, రూ.1000 పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్త రూ.500 నోట్లు చలామణిలోకి వచ్చాయి.
No comments:
Post a Comment