Welcome to NFPE Bhimavaram


Send latest circulars/news/articles that you wish to share on this blog
to " nfpebhimavaram@gmail.com " with your name,email,mobile.

December 19, 2016

చేసిన తప్పుకు ముఫ్పై ఏళ్ల తరువాత శిక్ష

చట్టం నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదనడానికి ఇదో ఉదాహరణ. సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం చేసిన తప్పుకు ఇద్దరు పోస్టుమ్యాన్లకు ఇప్పుడు జైలు శిక్ష పడింది. ఆ ఇద్దరు పోస్టు మ్యాన్లలో ఒకరు చనిపోయారు కూడా. ఇంకొకరు కొన్ని రోజుల్లో జైలుకెళ్లబోతున్నారు. వివరాల్లోకి వెళితే 1982 -84 మధ్యలో గుజరాత్‌లోని నవరంగపురా పోస్టాఫీసు పరిధిలో ప్రకాష్ త్రివేది, లక్ష్మీచంద్ పర్మార్ అనే ఇద్దరు పోస్ట్‌మ్యాన్‌లుగా పనిచేశారు. ఆ సమయంలో ఆ పరిధిలో ఉండే ప్రజలకు వచ్చే డీడీలు, చెక్ లు, విలువైన వస్తువులను కాజేసేవారు. అనేక పేర్లతో ఎకౌంట్లు ఓపెన్ చేసి వాటిలో చెక్‌లు వేసుకుని డ్రా చేసుకునేవారు. ఇలా అనేక రోజులుగా జరగడంతో అనేక మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విదేశాల నుంచి తమ వాళ్లు పంపించే విలువైన వస్తువులు కూడా రావడం లేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు సీబీఐకి వెళ్లింది. పోస్ట్ మ్యానుల చేతివాటం బయటపడింది.

1986లో కింది కోర్టు వారికి జైలు శిక్ష వేసినా బెయిలు మీద బయటికొచ్చారు. అనంతరం తిరిగి వారే హైకోర్టులో సవాలు చేశారు. అలా ఏళ్లు గడిచినా విచారణ మాత్రం పూర్తికాలేదు. చివరికి తాజాగా హైకోర్టు తుది విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పింది. పోస్టు మ్యానులు ఇద్దరిని దోషులుగా తేల్చింది. అయితే వారిలో ఒకరైన లక్ష్మీచంద్ పర్మార్ కొన్ని నెలల క్రితమే మరణించాడు. లొంగిపోవాలని చెబుతూ ప్రకాష్‌కు నాలుగు వారాల సమయమిచ్చింది కోర్టు.

No comments:

Post a Comment


Disclaimer:
The information contained in this website/blog is for information purpose only. This blog Author/Admin is not responsible for the accuracy, reliability and completeness of information provided in this website/blog. By viewing/reading this website/blog, you are accepting this.
--- Admin.
© 2016. NFPE BHIMAVARAM. sITE MAINTAINED BY A.ASHOKKUMAR,SPM,RAYAKUDURU-534247


Site is best viewed in Google Chrome. Last updated on 10-Jun-2017